నవోదయ-2025 పరీక్ష రాసే విద్యారులకు ముఖ్యమైన-సూచనలు
అడ్మిట్ కార్డ్ (Hall ticket) లేకుండా పరీక్షకు అనుమతించబడరు
ఆధార్ కార్డ్ మాత్రం కచ్చితంగా పట్టుకొని వెళ్ళండి .
అడ్మిట్ కార్డ్‌లోని వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఏదైనా లోపం ఉంటే, వెంటనే jnvkrishna@gmail.comకు ఇమెయిల్ ద్వారా సంబంధిత JNV ప్రిన్సిపాల్‌కు నివేదించాలి
పరీక్ష హాలులో ఎలక్ట్రానిక్ పరికరాలు/గాడ్జెట్లు అనుమతించబడవు.
పరీక్ష హాలులో అడ్మిట్ కార్డ్ మరియు నలుపు/నీలం బాల్ పెన్ (BLUE PEN or BLACK PEN) తప్ప, ఏ వస్తువులు తీసుకెళ్లవద్దు.
ఉదయం 10:00 గంటలకు పరీక్షా కేంద్రానికి రిపోర్టు చేయాలి.
ఆలస్యంగా వస్తే పరీక్షకు అనుమతించబడరు.
పరీక్ష మొత్తం వ్యవధి 2 గంటలు (ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు). అయితే
PHYSICAL HANDICAPPE వాళ్లకు 40 నిమిషాల అదనపు సమయం అందించబడుతుంది.
ఉదయం 11.15 నుండి 11.30 వరకు సూచనలను చదవడానికి 15 నిమిషాల అదనపు సమయం అనుమతించబడుతుంది.
సమాధానమివ్వడానికి ముందు, అభ్యర్థి ప్రశ్నల బుక్‌లెట్‌లో 1 నుండి 80 వరకు వరుస సంఖ్యలతో 80 ప్రశ్నలు ఉన్నాయా.. లేవా.. అని చూసుకోండి లేకపోతే విషయాన్ని ఇన్విజిలేటర్‌కు తెలియజేయండి.
OMR షీట్‌పై రాయడానికి మాత్రమే బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఉపయోగించండి.
పెన్సిల్ ఉపయోగించకండి
---------------------------------------
ప్రతి ప్రశ్నకు A, B, C & D అని నాలుగు options ఉంటాయి. సరైన సమాధానాన్ని ఎంచుకుని, OMR జవాబు పత్రంపై ఎంచుకున్న సమాధానానికి సంబంధించిన సర్కిల్‌ను బబుల్ చెయ్యండి.
నెగెటివ్ మార్కింగ్ ఉండదు
----------------------------------------
ఒక OPTION మాత్రమే బబుల్ చెయ్యండి.. 2,3 చెయ్యడం గానీ, చేసింది తప్పు పెట్టి ఇంకో OPTION బబుల్ చెయ్యడం చెయ్యకండి .
OMR షీట్లో వైట్నర్/కరెక్షన్ ఫ్లూయిడ్/ఎరేజర్ వాడకండి.
EXAM HALL లో ఒకరికొకరు చెప్పుకోవడం, మాట్లాడుకోవడం చెయ్యకండి.. అల చేస్తే EXAM రాయకుండా DISQUALIFY చేస్తారు..